Jio IPO Price Band: ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేశంలోనే అతిపెద్ద ఐపీఓ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ తేదీలు ఖరారయ్యాయి. ఈ అక్టోబర్ 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న ముగియనుంది. అక్టోబర్ 28న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ రూపంలో ఉంటుంది. 27 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచనున్నారు.


