ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న ‘జిమ్ జిమ్ తార’ పాటని హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్రం ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ పతాకంపై వై.జి. భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీదేవితో పాడించిన ఈ పాట ఆర్గానిక్‌గా నేరుగా ప్రేక్షకుల నోళ్లలో నానడం విశేషం. ఎలాంటి ఖరీదైన పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే వైరల్ అయిన ఈ పాట ట్రెండ్‌ను పట్టుకుని చిత్ర బృందం దీనినే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుంది. ఈ వినూత్న మార్కెటింగ్ ఎత్తుగడతో సినిమాకు థియేట్రికల్, బిజినెస్ పరంగా భారీ బజ్ ఏర్పడింది.
Jim Jim Tara: నెట్టింట మార్మోగుతోన్న ‘జిమ్ జిమ్ తార’.. ‘పర్ణశాల’ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్
RELATED ARTICLES


