దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూలేని విధంగా భద్రతా వలయంలో ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో వేల సంఖ్యలో పోలీసులు మోహరించి, ముందుస్తు అరెస్ట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి మహిళా పోలీసులను దింపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పురుష పోలీసులతో విద్యార్థినులను అదుపులోకి తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు వ్యూహం మార్చారు.


