HomeEntertainmentJailer 2: టీసీఎస్‌లో ఆరంకెల జీతం వదులుకుని వెండితెరకు.. ‘జైలర్ 2’లో షో స్టీలర్ ‘మూర్తి’...

Jailer 2: టీసీఎస్‌లో ఆరంకెల జీతం వదులుకుని వెండితెరకు.. ‘జైలర్ 2’లో షో స్టీలర్ ‘మూర్తి’ సక్సెస్ స్టోరీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రంలో ‘మూర్తి’ పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు నటుడు నమో నారాయణ. తనదైన టైమింగ్, సహజ నటనతో షో స్టీలర్‌గా నిలిచిన ఆయన నేపథ్యం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి, నటనపై ఉన్న అపరిమితమైన ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు 50కి పైగా చిత్రాల్లో సహాయ, హాస్య పాత్రల్లో మెప్పించిన నమో నారాయణ.. ‘జైలర్ 2’ ద్వారా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్రేక్ అందుకుని సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశంసలు సొంతం చేసుకుంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments