సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సరికొత్త దుమారానికి దారితీసింది. “చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం” అంటూ బన్నీ ప్రశంసలు కురిపించడమే ఈ వివాదానికి కారణమైంది. ఇప్పటికే చిరంజీవి, రజినీకాంత్ బాక్సాఫీస్ మార్కెట్‌పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, ఈ ట్వీట్ మెగా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇది మెగాస్టార్‌ను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యేనంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతుండగా, అల్లు అర్జున్ అభిమానులు సైతం ధీటుగా బదులిస్తుండటంతో మరోసారి ‘మెగా వర్సెస్ అల్లు’ ఫ్యాన్ వార్ తారాస్థాయికి చేరింది.
Jailer 2: మెగా – అల్లు ఫ్యాన్ వార్: ‘జైలర్ 2’ ట్వీట్‌తో రచ్చ.. బన్నీ కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
RELATED ARTICLES


