వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం అక్టోబర్ 30న విడుదలవుతుండటంతో.. అదే రోజున షెడ్యూల్ చేయబడిన చిన్న సినిమాలు వాయిదా పడుతున్నాయి. రోషన్ మేకా ‘ఏమో ఏమో ఇది’.. ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రాలని ఇప్పటికే వాయిదా వేశారు. ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ సినిమా కూడా అక్టోబర్ 30 రిలీజ్ నుంచి తప్పుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్కినేని నాగార్జున సమర్పణలో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ మూవీ కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Itllu Arjuna: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. నాగార్జున ‘ఇట్లు అర్జున’ వాయిదా
RELATED ARTICLES


