IndiGo Flight Fare Hike: విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సడెన్ షాక్ ఇచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై అదనంగా ఫ్యూయెల్ ఛార్జీలు విధించనుంది. అక్టోబర్ 6 నుంచి కొత్త బుకింగ్స్‌కు ఇవి వర్తించనున్నట్లు పేర్కొంది. దేశీయ విమానాల్లో చూస్తే ఇది దూరాన్ని బట్టి రూ. 375 నుంచి రూ. 1300 వరకు, అదే అంతర్జాతీయ విమానాల్లో రూ. 1000 నుంచి రూ. 6 వేల వరకు ఛార్జీలు ఉంటాయి.


