మూడేళ్ల చిన్నారిని ప్లే స్కూల్లో టీచర్, కేర్ టేకర్ చిత్రహింసలకు గురిచేశారు. కుర్చీకి కట్టేసి అత్యంత దారుణంగా వ్యవహరించారు. చెంపలు వాయించి, చెవులు లాగి కొట్టారు. వారి దాష్టీకానికి రెండు చెవులు వాచిపోయి, కర్ణభేరి దెబ్బతినే పరిస్థితికి చేరుకుంది. దీంతో స్కూల్ అంటేనే పిల్లాడు భయపడిపోతున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలుసుకోడానికి తల్లిదండ్రులు క్లాస్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో అమానుషం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు.
Delhi: ప్లే స్కూల్లో దారుణం.. మూడేళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి, రెండు చెవులు లాగి కొట్టిన టీచర్, కేర్ టేకర్
RELATED ARTICLES


