Cafe Niloufer Owner Babu Rao Story : 1975లో ఏదైనా ఉద్యోగం కోసం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఏ. బాబు రావు ఒకప్పుడు నగరంలో ఫుట్‌పాత్‌పై నిద్రించారు. టెక్స్‌టైల్ షాపులో సేల్స్‌మెన్‌గా మొదలైన ఆయన ప్రయాణం రెస్టారెంట్, తర్వాత కేఫ్ నిలోఫర్‌లో వెయిటర్‌గా మారింది. కష్టపడి పనిచేస్తూ కేఫ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఆయన, 1978లో తన సొంత వ్యాపారంగా తీర్చిదిద్దారు. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు రూ. 200 కోట్లకుపైగా ఆదాయం సాధించే స్థాయికి చేరుకుంది.



