APSSDC : ఏపీ నర్సులకు జర్మనీలో బంపర్ ఆఫర్.. 'ప్రాజెక్ట్ వసుధ' ద్వారా భారీ జీతంతో ఉద్యోగాలు
APSSDC : అర్హతగల నర్సులకు వృత్తి అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ప్రాజెక్ట్ వసుధ చేపట్టిన విషయం తెలిసిందే. దీని కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నర్సులు భాషా శిక్షణ, ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు.