శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ NTR భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. అర్హులందరికీ పథకాలు అందాలని, పారదర్శక పంపిణీ జరగాలని ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు.పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా నగదు అందజేశారు.పింఛన్ పొందిన లబ్ధిదారులు:బోయ ఆకులప్ప – రూ.4,000 (వృద్ధాప్య పింఛన్)నాగరాజు – రూ.6,000 (దివ్యాంగుల పింఛన్)వెంకటేషు – రూ.6,000 (దివ్యాంగుల పింఛన్)ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారుల ముంగిటకే పింఛన్ సొమ్ము అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్హుడికి పింఛన్ అందకుండా పోకూడదని, గ్రామ సిబ్బంది సమయానికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


