బెంగళూరులో ఓ బీహార్ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కర్ణాటక అసెంబ్లీ మీద ఓ AI వీడియో పెట్టి కటకటాలపాలయ్యాడు. హజ్రత్ అనే వ్యక్తి (25) కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన విధాన సౌధ (అసెంబ్లీ) దగ్గర బాంబు పేలుడు జరిగినట్టుగా ఓ AI వీడియోని రూపొందించి దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది కాస్తా వైరల్ అయింది. అయితే దానిమీద చాలామంది అసహనం వ్యక్తం చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
AIతో అసెంబ్లీని పేల్చేసినట్టు వీడియో చేశాడు.. పోలీసులు జైలు టూర్ అరేంజ్ చేశారు..
RELATED ARTICLES


