HomeTELANGANAఆయిల్‌పామ్ రైతులకు కేటుగాళ్ల వల.. తెగులు భయంతో నకిలీ మందుల విక్రయాలు!

ఆయిల్‌పామ్ రైతులకు కేటుగాళ్ల వల.. తెగులు భయంతో నకిలీ మందుల విక్రయాలు!

ఆయిల్‌పామ్ రైతులను ఫంగస్‌ తెగులు పేరుతో కొందరు విక్రయదారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలకు వ్యాధి సోకిందంటూ ప్రచారం చేసి.. తమ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు ఆయిల్‌పామ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను సంప్రదించగా.. అలాంటి తెగులును ఇప్పటివరకు గుర్తించలేదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాన్ని రైతులు గుడ్డిగా నమ్మకుండా, నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments