HomeTELANGANAMedak Gajalakshmi Sculpture: రాష్ట్రకూటుల శిల్పకళా అద్భుతం.. మెదక్‌లో అరుదైన గజలక్ష్మి శిల్పం లభ్యం

Medak Gajalakshmi Sculpture: రాష్ట్రకూటుల శిల్పకళా అద్భుతం.. మెదక్‌లో అరుదైన గజలక్ష్మి శిల్పం లభ్యం

Rashtrakuta Period Gajalakshmi Sculpture: మెదక్‌ జిల్లా కుల్చారం మండలం యనగండ్ల గ్రామంలోని హనుమాన్‌ ఆలయం వద్ద తొమ్మిదో శతాబ్దానికి చెందిన అరుదైన గజలక్ష్మి శిల్పం గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ నల్లరాతి శిల్పంలో లక్ష్మీదేవి, ఏనుగుల అభిషేకం, సముద్ర మథనం దృశ్యాలు ఉన్నాయి. వెనుకవైపు పన్నెండు చేతులతో శివనటరాజు, బ్రహ్మ, విష్ణువుల రూపాలు చెక్కారు. పురావస్తు నిపుణులు దీన్ని పరిశీలించి చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించారు. గ్రామస్థులు శిల్పాన్ని పీఠంపై ఏర్పాటు చేసి పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments