హైదరాబాద్ అత్తాపూర్‌లో 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి నెట్టినట్లు నమోదైన కేసులో టోలిచౌకి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అతిఫ్.. ఆమెను ఇతరులకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి బాలికను రూ.30 వేలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 5న బాలిక తప్పించుకుని కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. కుటుంబం ఫిర్యాదు చేయడంతో బీఎన్‌ఎస్, పోక్సో చట్టాల కింద కేసు నమోదైంది.


