ఓ సినిమాలో చెప్పినట్లుగా ఇంగువ లేకుండా పులిహోర చేస్తే ఏం బాగుంటుంది అన్నట్లుగా.. నిజమే మరి పులిహోర, పప్పు చారు, చారు, పచ్చళ్ళు వీటన్నింటిలో ఇంగువ వేస్తేనే ఆ రుచి, సువాసనలు ఉంటాయి. కాబట్టి, పులిహోర, ప్రసాదాలు, పచ్చళ్ళు ఎక్కువగా చేసినప్పుడు కచ్చితంగా ఇంగువని వాడతారు. అయితే, దీనిని చాలా మంది బయటినుంచే కొనుక్కొచ్చి వాడతారు. అన్ని పదార్థాల్లో కల్తీ జరిగినట్లుగానే ఇంగువలోనూ కల్తీ జరుగుతున్నట్లుగా కొన్ని చోట్ల గుర్తించారు. అలాంటప్పుడు బయట దొరికే కల్తీ రకం తీసుకునే బదులు ఇంట్లోనే మనకి మనంగానే ఇంగువని తయారుచేసుకోవచ్చుగా. పైగా ఇది నిమిషాల పని. మనం తయారుచేసిన ఇంగువకి మంచి ఫ్లేవర్తో పాటు తాజాదనం కూడా ఉంటుంది. మరి అలాంటి ఇంగువని ఎలా చేయాలో తెలుసుకోండి.


