HomeTELANGANAభూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం.. 2,240 గ్రామాల్లో భూముల రీ సర్వే

భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం.. 2,240 గ్రామాల్లో భూముల రీ సర్వే

తెలంగాణలో భూముల సమగ్ర రీ సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసి భూ వివాదాలను తగ్గించడమే లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్వే పర్యవేక్షణకు ఏడు జోన్లలో 14 మంది అధికారులను నియమించారు. హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేసి, రోజువారీ పురోగతిని రియల్‌టైంలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలో నక్షా పటాలు లేని 365 గ్రామాల్లో సర్వే చేపట్టగా.. 2,240 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఎర్రవల్లిలో అసైన్డ్‌ భూముల మార్పిడి, విస్తీర్ణ వ్యత్యాసాలపైనా అధికారులు పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments