ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో కోట్లాది మంది అర్హులు ఓటు హక్కును కోల్పోతున్నారని, బీజేపీకి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొత్తులా మారిపోయారని ప్రతిపక్షాలు, పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా, ఆయన రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో నిరసనకారులు ఢిల్లీలోకి రాకుండా అష్టదిగ్భంధనం చేసిన పోలీసులు.. ఎక్కడకక్కడ అరెస్ట్ చేస్తున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్లే దారులన్నీ మూసివేశారు. అలాగే, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.


