తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దీంతో కెమెరా వెనుక నుంచి తెర ముందుకు వచ్చి, తండ్రి బాటలోనే హీరోగా అదృష్టం పరీక్షించుకోవాలని సంజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆయన్ను హీరోగా గ్రాండ్గా లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డెబ్యూ ప్రాజెక్ట్ కోసం సీనియర్ దర్శకుడు లింగుసామితో పాటు సంజీవ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మెగాఫోన్ పక్కన పెట్టి మేకప్ వేసుకోనున్న విజయ్ తనయుడు… హీరోగా జేసన్ సంజయ్ గ్రాండ్ ఎంట్రీ?
RELATED ARTICLES


