HomeHeadlinesTamil Nadu Bypoll Results Live: రెండు చోట్లా టీవీకే విజయం.. 109కి చేరిన బలం

Tamil Nadu Bypoll Results Live: రెండు చోట్లా టీవీకే విజయం.. 109కి చేరిన బలం

తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టన్ చావడి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. వీటితోపాటు అసోంలోని నగావ్ లోక్ సభ స్థానం ఉపఎన్నికల ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉపఎన్నికలు నిర్వహించారు. నందిగ్రామ్ ఉపఎన్నికల్లో 80.89 శాతం పోలింగ్ కాగా.. రెజీనగర్‌లో 80.08 శాతం పోలింగ్ నమోదైంది. ఉపఎన్నికల్లో పోలింగ్ దాదాపుగా ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని.. తమ పార్టీల పోలింగ్ ఏజెంట్లను తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ (ఏజేయూపీ) చీఫ్ హుమాయున్ కబీర్ ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెజీనగర్‌తోపాటు నౌడా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెజీనగర్ స్థానాన్ని ఆయన వదులుకోవడంతో ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికల వేళ రెజీనగర్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం రెండూ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు. మధురాంతకం నియోజకర్గంలో 2.13 లక్షల ఓట్లు ఉండగా.. ఉపఎన్నికలో 27 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే మరగనాథం కుమారవేల్ టీవీకే నుంచి పోటీ చేయగా.. డీఎంకే నుంచి పరాంతమన్, అన్నాడీఎంకే నుంచి కణిత సంపత్, ఎన్టీకే నుంచి జి.జానకీరామన్, సీపీఐ(ఎం) నుంచి పి.సుగంతి పోటీ చేశారు. మరగనాథం కుమారవేల్ అన్నాడీఎంకేకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురాంతకంలో 93.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉపఎన్నికలో 86.26 శాతం పోలింగ్ నమోదైంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments