తెలంగాణలో శ్రీశైలం నీటి వినియోగం, డిండి ప్రాజెక్టు, మద్యం ఉత్పత్తి, ఎక్సైజ్ ఆదాయంపై తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన విమర్శలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగించాలని తాను చెప్పలేదని.. డిండి ప్రాజెక్టుకు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను తీసుకురావాలని మాత్రమే సూచించానని స్పష్టం చేశారు. ఎల్‌నినోను మద్యం అమ్మకాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. తెలంగాణలో మద్యం ఆదాయం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భారీగా పెరిగిందని ఆరోపించిన జూపల్లి.. తమ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెరుగుదలపై లెక్కలు వెల్లడించారు.


