37 ఏళ్ల వయసులో, 15 వేల వన్డే పరుగుల రికార్డు దాటిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ గేర్‌ను మార్చి కొత్త ‘వెర్షన్’ను ఆవిష్కరించాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత, ఎలాంటి ఒత్తిడి లేకుండా మైదానంలోకి అడుగుపెడుతున్న విరాట్, తొలి 20 బంతుల్లోనే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తున్నాడు. సిక్సర్లు కొట్టడం, క్రీజును ఉపయోగించి పేసర్లను భయపెట్టడంలో సరికొత్త అగ్రెషన్‌ను చూపిస్తూ వన్డేల్లో మళ్లీ తిరుగులేని శక్తిగా నిలుస్తున్నాడు.


