HomeAndhra Pradeshబస్సు కొంచెం ముందుకు ఆపారని రెచ్చిపోయిన మహిళలు.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

బస్సు కొంచెం ముందుకు ఆపారని రెచ్చిపోయిన మహిళలు.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఊహించని ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు, సిబ్బందిపై కొందరు మహిళలు కోడిగుడ్లతో దాడి చేశారు. గురజాలలోని మాడుగుల రహదారి దగ్గర బస్సును కొంచెం ముందుకు ఆపారనే కోపంతో ఓ మహిళ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. కొందరు మహిళలు ఆ బస్సు మళ్లీ తిరిగి వచ్చే సమయానికి రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి, బస్సుపై దాడి చేశారు. అడ్డుకున్న డ్రైవర్, కండక్టర్‌ను కూడా కొట్టారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కొందరుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments