శ్రీవారి భక్తుడైన నోముల అశోక్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. టీటీడీ నిర్వహించే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కోసం ఏకంగా రూ.1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. శుక్రవారం స్వయంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడును కలసి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు, అశోక్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఈ ట్రస్ట్ నిధులతో నిరుపేదలకు ఉచితంగా అధునాతన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందిస్తుంది. స్వీ ప్రాణదాన ట్రస్ట్ 2001 నవంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే ఉంది.
శ్రీవారి భక్తుడి ఉదారత: ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల భారీ విరాళం
RELATED ARTICLES


