ది ప్యారడైజ్ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో నటించి ప్రేక్షక్షులను మెప్పించిన నటుడు ప్రియదర్శిపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. ప్రియదర్శిని తన నివాసంలో కలసి సత్కరించారు. మల్లేశం, బలగం చిత్రాలతో తెలంగాణ చేనేత కార్మికుల జీవితాలు, పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను ప్రపంచానికి పరిచయం చేశారని అభినందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని సహా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే మరిన్ని గొప్ప చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు.


