పీవీఆర్ సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. ఏకంగా రూ.75 వేలు జరిమానా విధించింది. థియేటర్లో 22 నిమిషాల పాటు యాడ్స్ వేశారని.. దీంతో సినిమాను 17 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. యాడ్స్, ట్రైలర్లు ప్రదర్శించి.. సినిమా ఆలస్యానికి కారణం కావడంతో ఓ లాయర్.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఆలస్యం కారణంగా తాను ఇంటికి చేరే సమయం గంట ఆలస్యమైందని పేర్కొన్నారు. దీంతో పీవీఆర్ సినిమాస్‌కు రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.


