చిత్తూరు జిల్లాలోని అడవి ఏనుగుల సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కుంకీ ఏనుగులు, హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ సహకారంతో ఏనుగుల సంచారంపై నిఘా పెట్టాలని, వాటి వల్ల ఎటువంటి ఘర్షణలు జరగక్కుండా చూసుకోవాలని ఆదేశించారు. కాగా గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, ఆ గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
రంగంలోకి కుంకీ ఏనుగులు, హనుమాన్ బృందాలు.. చిత్తూరులో గజరాజుల టెర్రర్‌పై పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్
RELATED ARTICLES


