ఏ ఇంట్లో అయినా సరే పిల్లలు ఉండటం తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కొందరికి కొడుకులంటే ప్రాణమైతే.. మరికొందరికి కూతుళ్ల అంటే చాలా ఇష్టం. అయితే, మన భారతదేశంలో చాలా మంది అబ్బాయిలు పుడితే తెగ సంతోషపడుతుంటారు. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలు పుడితే.. ఇంటికి సాక్ష్యాత్తూ లక్ష్మీదేవి వచ్చిందని సంబరపడుతుంటారు.
పిల్లల్లో కొడుకులు లేదా కూతుళ్లు ఉండటం వల్ల తల్లిదండ్రుల ఆనందంలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అంశంపై చైనాలో జరిగిన ఒక సరికొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? లేదంటే కూతుళ్లు ఉన్న పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా అని అధ్యయనం నిర్వహించారు. మరీ ఆ అధ్యయనంలో ఏం తేలిందో తెలుసుకుందాం.


