శ్రీకాకుళం వరదల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన అధికార యంత్రాంగానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితిని పరిశీలిస్తున్న క్రమంలో ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్, SP, ఇతర అధికారులు ప్రవాహ ఉధృతికి వరద నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన NDRF, SDRF బృందాలు సకాలంలో స్పందించి వారిని రక్షించాయి. అందరూ క్షేమంగా బయటపడటంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనతో జిల్లాలో వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.


