తెలంగాణలోని ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్నప్పటికీ.. సాంకేతిక లోపాల వల్ల సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా)లో చిక్కుకున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తక్షణమే అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 22ఏ భూముల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


