Multibagger Stock: స్మాల్ క్యాప్ కేటగిరీలోని క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ రేమండ్ లిమిటెడ్ స్టాక్ అదరగొడుతోంది. గత 6 నెలల కాలంలోనే ఈ స్టాక్ ఏకంగా 225 శాతం పెరిగింది. ఆరు నెలల క్రితం రూ.1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.3.25 లక్షలకు పైగా వస్తాయి. ఈరోజు సైతం 9 శాతం మేర దూసుకెళ్లి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. మరి ఈ స్టాక్ ఇలా దూసుకెళ్లడానికి గల కారణాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.


