వాకింగ్ ఎవరైనా ఈజీగా చేయగలిగే వ్యాయామం. అయితే, ప్రస్తుత రోజుల్లో ఫిట్నెస్ సాధించాలనుకునే వారికి “రోజుకు 10,000 అడుగులు” అనేది ఒక టార్గెట్‌గా మారిపోయింది. అయితే, ఈ 10,000 అడుగుల లక్ష్యం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా వర్తించదు. ఒక వ్యక్తికి ఎంత శారీరక శ్రమ అవసరమనేది వారి వయసు, శారీరక సామర్థ్యం, ఆరోగ్య సమస్యలు, వారి లైఫ్‌స్టైల్‌పై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, 10,000 కంటే తక్కువ అడుగులు వేసినప్పటికీ శరీరానికి తగిన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
ముఖ్యంగా వృద్ధుల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వృద్ధ మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో రోజుకు 2,700 అడుగులు వేసేవారితో పోలిస్తే, 4,400 అడుగులు వేసేవారిలో మరణ ముప్పు (Mortality risk) గణనీయంగా తగ్గింది. ఈ ప్రయోజనాలు దాదాపు 7,500 అడుగుల వరకు పెరుగుతూ వెళ్లి, ఆ తర్వాత స్థిరపడ్డాయి. పరిశోధనల ప్రకారం ఏ వయసు వారు ఎన్ని అడుగులు నడవాలో తెలుసుకుందాం.


