పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. గల్ఫ్‌లో ఉద్రిక్తతల వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధి మూతపడింది. ఈ నేపథ్యంలో జల సంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ కీలక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. ఒకవేళ, సైన్యాన్ని తగ్గించి, దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేస్తే.. ఏడు రోజుల్లోగా తిరిగి హర్మూజ్‌ను తెరవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేసింది. దీంతో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
అలా చేస్తే ఏడు రోజుల్లోనే హర్మూజ్‌ను తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ ఆఫర్
RELATED ARTICLES


