HomeLifestyleపరీక్షల్లో కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు, గుండెపోటు వచ్చే ముందు శరీరం...

పరీక్షల్లో కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు, గుండెపోటు వచ్చే ముందు శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఇవే!

కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్న గుండెపోటు వస్తోందా? అనే సందేహం చాలా మందికి ఉంది. ఈ సందేహనికి అవును అని సమాధానం ఇచ్చారు డాక్టర్ జగదీష్ మదిరెడ్డి (కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). కొలెస్ట్రాల్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారణమే అయినప్పటికీ, అది మాత్రమే పూర్తి కారణం కాదు.

​కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్న వారిలో కూడా రక్తనాళాల్లో పూడికలు అంటే ప్లాక్ ఏర్పడొచ్చు. ఒక రీసెర్చ్ ప్రకారం సరైన రక్తపోటు (బీపీ), షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అన్నీ సరిగ్గా ఉన్న ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో దాదాపు సగం మందికి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లు గుర్తించారు. లిపిడ్ ప్రొఫైల్ రిపోర్టులో అన్నింటికంటే ముఖ్యమైంది చెడు కొలెస్ట్రాల్ లేదా LDL కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్న గుండెపోటు ఎందుకు వస్తుంది? ఏ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న పూర్తి వివరాలపై సమాచారం అందించారు డాక్టర్ జగదీష్ మదిరెడ్డి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments