ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. షెఫాలీ వర్మ (100 నాటౌట్, 9 సిక్సర్లు) తొలి టీ20ఐ సెంచరీతో భారత్ 195/4 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను దీప్తి శర్మ (3/7), నందని శర్మ (3/25) దెబ్బ కొట్టారు. దీంతో బంగ్లాదేశ్.. కేవలం 15.4 ఓవర్లలోనే 81 రన్స్‌కు ఆలౌట్ అయింది.


