HomeTELANGANAKTR నా బాల్యమిత్రుడు, జన్వాడ ఫామ్‌హౌస్‌ నాది.. ప్రదీప్‌రెడ్డి క్లారిటీ

KTR నా బాల్యమిత్రుడు, జన్వాడ ఫామ్‌హౌస్‌ నాది.. ప్రదీప్‌రెడ్డి క్లారిటీ

జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారంపై దాని యజమానిగా పేర్కొంటున్న ప్రదీప్‌రెడ్డి స్పందించారు. ఫామ్‌హౌస్ ఉన్న భూమి తన సొంతమని.. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. 2019లో ప్రాపర్టీని కొనుగోలు చేసి కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని, చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏవైనా సందేహాలు ఉంటే నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని, అవసరమైన పత్రాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే రాజకీయ నేతలు వ్యక్తిగత ఆస్తిని పరిశీలించేందుకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments