స్కాల్ప్ స్క్రబ్బింగ్ అనేది ఓ రకమైన ఎక్స్‌ఫోలియేషన్ ఇది తలపై ఉండే ఎక్సెస్ ఆయిల్‌ని తగ్గించి మృత చర్మ కణాల్నికూడా తగ్గిస్తుంది. దీంతో చుండ్రు తగ్గడమే కాకుండా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అవశేషాలు కూడా తొలగిపోతాయి. ఈ స్కాల్ప్ స్క్రబ్ చేయడం వల్ల తలపై ఉండే చర్మం సజీవంగా ఉంటుంది. స్కాల్ప్‌పై స్క్రబ్ చేస్తే చుండ్రు తగ్గడమే కాకుండా మరెన్నో లాభాలు ఉన్నాయి. అయితే, దీనిని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు డాక్టర్ పద్మజ(సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) మాటల్లో తెలుసుకుందాం.


