తెలంగాణలో ఖాళీ కానున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్.. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు. ఈనెల 28న ప్రజా నోటీసు జారీ చేయనుండగా.. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన పట్టభద్రులు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది.


