ప్రస్తుతం యాంత్రిక జీవన విధానంలో గుండె సంబంధిత సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్‌లు, పక్షవాతం, బీపీ వంటివి వయసుతో సంబంధం లేకుండా పెరిగిపోతున్నాయి. అడ్డదిడ్డమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి వంటి వాటి వల్ల రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ప్రాణాపాయ స్థితిని దారితీస్తోంది. అయితే మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. దీనికి అద్భుతమైన నివారణ మార్గం ఓమెగా-3 ప్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం.
ముఖ్యంగా మన వంటింట్లో సులభంగా దొరికే అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడకుండా నిరోధించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తప్రసరణను క్రమబద్ధీకరించి మెదడుకు రక్తం గడ్డకట్టకుండా చూసి స్ర్టోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ సహజసిద్ధమైన ఆహారంతో బీపీ, హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌ను ఎలా అరికట్టవచ్చో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


