వంటింట్లో వంటకు రుచికి రావడం కోసం మనం ఎన్నో మసాలాలు, పదార్థాలు ఉపయోగిస్తుంటాం. వాటిలో అల్లం – వెల్లుల్లి పేస్ట్ ముందుస్థానంలో ఉంటుంది. దాదాపు ప్రతి వంటింట్లోనూ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా మారింది. చాలామంది మార్కెట్లో దొరికే ప్యాకెట్లు లేదా బాటిళ్లను కొంటుంటారు. కానీ కొందరు మాత్రం ఇంట్లోనే సిద్ధం చేసుకుంటారు. బయట దొరికే పేస్ట్ల్లో కల్తీలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసినప్పటి నుంచి ఇంట్లోనే తయారు చేసుకునే వారి సంఖ్య పెరిగింది.
అయితే, ఇంట్లో చేసిన పేస్ట్ బయటి వాటిలా మంచి రుచిగా రావడం లేదని చాలామంది భావిస్తుంటారు. దీనికి అసలు కారణం అల్లం, వెల్లుల్లి కొలతలు (రేషియో) సరిగ్గా లేకపోవడమే. సరైన నిష్పత్తిలో తీసుకుంటే ఇంట్లో చేసిన పేస్ట్ కూడా మార్కెట్ రుచితో అదిరిపోతుంది. అల్లం – వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా రావాలంటే పాటించాల్సిన సరైన కొలతలేంటో తెలుసుకుందాం.


