మానవాళినే అంతం చేస్తుంది: ఏఐ ప్రమాదాలపై హెచ్చరిస్తూ గూగుల్ నిపుణుడి రాజీనామా
కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి మానవ నియంత్రణను దాటి వేగంగా దూసుకెళ్తోందని గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయి హెచ్చరించారు. ఈ సాంకేతికత వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.