ఏపీలో ఉద్యోగులు, పింఛనుదారులకు సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న 2 విడతల డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూలై 1 నుంచి 2.73 శాతం.. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏను అమలు చేయనున్నారు. దీంతో మొత్తం 4.55 శాతం డీఏ పెరగనుంది. పెంచిన డీఏను సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించారు.


