బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. స్థానిక టీడీపీ నాయకత్వం అంగీకారం తీసుకున్న తర్వాతే చిన్న శ్రీనును పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు. పార్టీలోకి ఎవరైనా రావాలంటే స్థానిక నాయకత్వం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చర్చల అనంతరం సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు.


