Polala Amavasya 2026: హిందూ సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి నెలా క్రిష్ణ పక్షంలో చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన శ్రావణ శుక్రవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. దీన్నే శ్రావణ అమావాస్య, కుషోత్పతి అమావాస్య అని కూడా అంటారు. ఈ పర్వదినాన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధ కర్మ పూజలు చేస్తారు. అదే విధంగా సంతానం కోసం ఎదురుచూసే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ అమావాస్య వేళ పితృదోషం, కాల సర్పదోషం నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పోలాల అమావాస్య వేళ తమ జన్మ నక్షత్రం ఆధారంగా, రాశిని బట్టి కొన్ని పరిహారాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఏయే పరిహారాలను పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోలాల అమావాస్య 2026: శ్రావణ శుక్రవారం వేళ రాశి ప్రకారం గ్రహ దోష నివారణకు పాటించాల్సిన పరిహారాలు
RELATED ARTICLES


