ఈ రోజుల్లో మోకాళ్ల నొప్పి కేవలం వృద్ధుల సమస్య మాత్రమే కాదు. 30, 40 ఏళ్ల వయసులో ఉన్న చాలా మంది మోకాళ్ల నొప్పి, బిగుసుకుపోవడం, మెట్లు ఎక్కడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు.. “డాక్టర్, మోకాలి ఇంజెక్షన్ తీసుకుంటే నా ఆర్థరైటిస్ (కీళ్లనొప్పుల సమస్య) పూర్తిగా నయమవుతుందా?”.. మోకాలి నొప్పులు రోజువారీ పనుల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు చాలామంది రోగులు అడిగే సాధారణ ప్రశ్న ఇది.
ఇంజెక్షన్లు కొంతమందికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి కానీ, ఇవి మోకాలి సమస్యలన్నింటికీ సంపూర్ణమైన లేదా శాశ్వతమైన చికిత్స కావు. ఈ చికిత్సను ఎంచుకునే ముందు ఇంజెక్షన్ ద్వారా ఏం సాధ్యం, ఏం సాధ్యం కాదు అనే స్పష్టత ఉండడం చాలా ముఖ్యం. ఈ విషయంపై డాక్టర్ రాకేష్ కొమురవెల్లి (హెచ్ఓడి – ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గ్లెనీగల్స్ హాస్పిటల్ (ఫోర్టిస్ నెట్వర్క్), లక్డీకాపూల్, హైదరాబాద్) పూర్తి వివరాలు అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


