టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్లో ఆర్ టర్మెరోన్, ఆల్ఫా టర్మెరోన్ వంటి సెస్క్విటెర్పెన్ సమ్మేళనాల కారణంగా ఇది స్కిన్ అండ్ హెయిర్‌కి చాలా మంచిది. వాటితో పాటు పవర్ఫుల్ శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. దీనిని మనం వాడితేగనుక మొటిమలు తగ్గడం దగ్గర్నుంచీ యాంటీ ఏజింగ్‌లా పనిచేసి వయసు తాలూకూ లక్షణాలని కనిపించకుండా చేస్తుంది. ఇక జుట్టుకి కూడా ఎంతగానో మంచిది. ఫంగస్ వ్యతిరేక గుణాల కారణంగా దురదని తగ్గించి జుట్టుని హెల్దీగా మారుస్తుంది. మరెన్నో లాభాలు కూడా ఈ టర్మెరిక్ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాం.


