చాలా కాలంగా మనం ‘పీసీఓఎస్’ (Polycystic Ovary Syndrome) అని పిలుస్తున్న ఈ సమస్య పేరును 2026 మే నెలలో అధికారికంగా మార్చారు. ‘ది లాన్సెట్’ (The Lancet) జర్నల్‌లో ప్రచురితమైన అంతర్జాతీయ ఏకాభిప్రాయం ప్రకారం, దీనికి PMOS (Polyendocrine Metabolic Ovarian Syndrome) అని పేరు పెట్టారు. ఇది కేవలం అండాశయాలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, శరీరం మొత్తంపై ప్రభావం చూపే హార్మోన్ల, జీవక్రియల (మెటబాలిక్) లోపమని స్పష్టం చేయడానికే ఈ పేరు మార్చారు.
వాడుకలో PCOS అనే పదం ఇంకా కొనసాగినప్పటికీ, ఈ కొత్త పేరు దీని తీవ్రతను గుర్తుచేస్తుంది. నేడు PCOS, రేపు డయాబెటిస్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ వి. సోమ శ్రీనివాస్ (కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, గ్లెనెగల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్, హైదరాబాద్) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.


