HomeLifestyle15 రోజుల్లో 20 కిలోలు తగ్గిన మహిళ, తర్వాత ఎన్ని సమస్యలొచ్చాయంటే, అసలు స్పీడ్‌గా బరువు...

15 రోజుల్లో 20 కిలోలు తగ్గిన మహిళ, తర్వాత ఎన్ని సమస్యలొచ్చాయంటే, అసలు స్పీడ్‌గా బరువు తగ్గితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే

బరువు తగ్గాలనుకోవడం మంచి విషయమే. కానీ, దానికోసం సరైన విధానం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎలా అయినా బరువు తగ్గాలనుకోవడం కంటే హెల్దీగా ఎలా బరువు తగ్గాలని ఆలోచించాలి. అంతేకానీ, ఫాస్ట్ రిజల్ట్ కోసం మన ప్రయత్నాలు మన ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టొద్దు. ఇప్పటి ఫాస్ట్ మనుషులకి అన్నీ రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గానే రావాలి. దానికోసమే ఏవి పడితే అవి ఫాలో అవ్వడం, షార్ట్ కట్స్ వెతకడం చేస్తుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ మధ్యకాలంలోనే చైనాలో ఓ మహిళ 15 రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకుని బరువు తగ్గించుకోవాలనుకుంది. అలానే చేసి 20 కిలోల బరువు కూడా తగ్గింది. దీని వల్ల తన ప్రాణాన్ని రిస్క్‌లో పడేసింది.
చైనాకి చెందిన 31 ఏళ్ల మహిళ వాటర్ ఫాస్టింగ్ చేసింది. తర్వాత ఆమె నడవడంలో ఇబ్బంది మొదలవ్వడమే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గింది. వెర్నికేస్ ఎన్సెఫలోపతి అనే తీవ్ర సమస్య వచ్చినట్లుగా డాక్టర్స్ నిర్ధారించారు. అందుకే, ఎలా అయినా బరువు తగ్గాలనుకునేవారు స్పీడ్‌గా బరువు తగ్గితే ఏయే సమస్యలు వస్తాయో ముందుగా తెలుసుకోవడం మంచిది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments