మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కటకానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రేపు పెళ్లనగా.. సరదాగా స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్లిన పెళ్లి కొడుకు కూడా ఇందులో గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఈతకు దిగి ఆ ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. ఈ యువకుల గల్లంతుతో పెళ్లింట విషాదం నెలకొంది.
వెలిగొండ ప్రాజెక్టు వద్ద ప్రమాదం.. ఫీడర్ కెనాల్లో పెళ్లికొడుకు గల్లంతు.. పార్టీ చేసుకుందామని వచ్చి విషాదం
RELATED ARTICLES


