క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) నిబంధనల పునఃపరిశీలనకు సెబీ మొగ్గు చూపడంతో శుక్రవారం ట్రేడింగ్లో బ్రోకింగ్ సంస్థలు, బీఎస్ఈ షేర్లు 8 శాతం వరకు ఎగబాకాయి. డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ విధానంలో త్వరలోనే మార్పులు చేయనున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించడమే ఇందుకు కారణం.


